ఒంగోలు అర్బన్: మీడియా అసెంబ్లీ వేదికగా వెలిగొండ పై వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ మాటల యుద్ధం
Ongole Urban, Prakasam | Aug 21, 2026
వెలిగొండ ప్రాజెక్టు కు సంబంధించిన అర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తిగా చెల్లించకుండా ప్రాజెక్టు ట్రైల్ రన్ నిర్వహించాలనుకోవడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వాక్యాలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి కౌంటర్ ఇచ్చారు.మంత్రి మాట్లాడుతూ గతంలో ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి నేడు పనులన్నీ పూర్తి చేసి అర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లిస్తూ ప్రాజెక్టు నీటిని తీసుకు వస్తుంటే ఓర్వలేక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటల్లోనే ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ఒప్పుకున్నాడని దానికి వివరణ చెప్పాలన్నా