హిమాయత్ నగర్: నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: మాజీ మంత్రి కేటీఆర్
తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తనని అన్నారు. మంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి మీరు, నేను హైకోర్టు సీజే దగ్గరకి పోదాం.. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దామని అన్నారు.