శ్రీశైలం: ఎన్నికలవేళ ఎవరు అయినా భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్
ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అభ్యర్థులందరూ ఎలాంటి భయందోళనలు లేకుండా,స్వేచ్ఛగా మరియు స్వతంత్రంగా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని ఆత్మకూరు డీఎస్పీ ఆర్. రామంజి నాయక్ స్పష్టం చేశారు.స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,శ్రీశైలం మరియు నందికొట్కూరు నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. నామినేషన్ వేసే సమయంలో ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు