కోరుట్ల: కోరుట్లలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలు: రక్తదాన శిబిరం ప్రారంభం
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.