పెద్దాపురం: సామర్లకోటలో బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి
సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్లోని ఓ బేకరీలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కేశవ ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నాణ్యతలేని ఉత్పత్తులు అమ్ముతున్నారని ఫిర్యాదు రావడంతో ఈ తనిఖీలు చేపట్టి, శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించారు.