శ్రీశైలం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహానంది మండలంలో 26 మందిపై బైండోవర్ కేసులు నమోదు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహానంది మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు మహానంది ఎస్సై శివాంజల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గొడవలు సృష్టించే వారితో పాటు, గతంలో నేరాలకు పాల్పడిన వారు, తదితరులను గుర్తించి ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.