డోన్: మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి
Dhone, Nandyal | Aug 23, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రూ.3 కోట్లతో నిర్మించిన నూతన మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. కార్యాలయాన్ని పరిశీలించి, మండల పరిషత్ కార్యకలాపాలకు నూతన భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ రాజ్‌కుమార్, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, ఎంపీటీసీలు రామలక్ష్మమ్మ, సునీత పాల్గొన్నారు.