ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు భవానీ భక్తులు మృతి
కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన స్కార్పియో వాహనం భక్తులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.