మేడ్చల్: ఉప్పల్: నల్లచెరువు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు
ఉప్పల్ డివిజన్ శేషసాయినగర్, మల్లికార్జున కాలనీలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. విద్యుత్ స్తంభాల అడ్డంకిని తొలగించి పనులు వేగవంతం చేయాలని కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అధికారులను కోరారు. స్తంభాల తరలింపుపై విద్యుత్ శాఖ హామీ ఇచ్చింది.