మార్కాపురం: సీతా నాగులవరం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత తనిఖీ చేశారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ కార్డులో తప్పులు ఉన్నవారికి నోటీసులు జారీ చేశారు. సంబంధిత ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పరిశీలించి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.