వరంగల్: పశు వైద్య కార్యాలయం వద్ద వృథాగా పోతున్న తాగునీరు
వరంగల్ నగరంలోని పశు వైద్య కార్యాలయం వద్ద మంచినీటి పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా మురుగు కాలువల్లోకి చేరుతోంది. రోడ్డుపై నీరు నిలవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.