అంగళ్లులోని చేనేత నగర్‌లో ఓ ఇంట్లో రూ.లక్ష నగదు, మరో రూ.3లక్షలకు పైన విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ, పోలీసులకు ఫిర్యాదు
*కురబలకోట చేనేత నగర్లో భారీ చోరీ* ఇంటి తాళాలు పగలగొట్టి డబ్బు, బంగారు ఆభరణాలను దొంగలు దోచేశారు. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై బాధితులు ముదివేడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గం, కురబలకోట మమడలం, అంగళ్ళు గ్రామం, చేనేతనగర్లో ఉండే బాష రాత్రి అంగళ్ళు సమీపంలోని బ్రాహ్మన వడ్డిపల్లిలోని తన కూతురు ఇంటికివెళ్లారు. ఉదయం వచ్చి చూస్తే దొంగలు ఇంట్లోని డబ్బు లక్ష, మరో 3లక్షలకు పైన విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలు దోచేసారని బాదితుడు ముదివేడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్చి ఉంది