నంద్యాల అర్బన్: జిల్లాలో భారీగా లోటు వర్షపాతం : జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు
Nandyal Urban, Nandyal | Oct 3, 2026
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రోజు నుంచి నంద్యాల జిల్లాలో భారీగా వర్షపాతం లోటు ఏర్పడిందని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ 1 నుంచి నేటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 530.9 మి.మీ కురవాల్సి ఉండగా.. కేవలం 293.4 మి.మీ మాత్రమే నమోదైనట్లు వెల్లడించారు. దీంతో ఖరీఫ్ పంటలను రైతులు పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు