డోన్: వైసిపి అభ్యర్థులను గెలిపించండి బేతంచర్ల లో మాజీ మంత్రి బుగ్గన కుమారుడు అర్జున్ రెడ్డి
Dhone, Nandyal | Oct 23, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని మూడో వార్డులో నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థి దస్తగిరి, వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతల నాగిరెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలకు వివరించారు.