మదనపల్లి: మదనపల్లెలో సీఎం చంద్రబాబు, మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన: భద్రతా ఏర్పాట్ల పరిశీలన
అక్టోబర్ 2న మదనపల్లెలో జరగనున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి హెలిప్యాడ్, సభా వేదిక వద్ద బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.