కావలి (M) ముసునూరు టోల్ ప్లాజా వద్ద గురువారం రోడ్డు ట్రాన్స్ పోర్ట్ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. హైదరాబాద్-నెల్లూరు వస్తున్న బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని వారు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూల్ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత కూడా ట్రావెల్స్ యజమానులు భద్రత చర్యలు పాటించడం లేదని పలువురు మండిపడుతున్నారు