ఆసిఫాబాద్ మహాత్మ జ్యోతి బాపులే పాఠశాలకు వెళ్లడానికి సరైన రహదారి లేక పోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల ఉపాధ్యాయుడు మారుతి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..జాతీయ5రహదారి నుంచి 500 మీటర్ల వరకు రహదారి అధ్వానంగా ఉందన్నారు. కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేదన్నారు. అటవీ జంతువులు కూడా తిరుగుతున్నాయన్నారు. పాఠశాల సమీపంలో రాత్రి వేళల్లో కొందరు యువకులు మద్యం తాగుతున్నారని తెలిపారు. పాఠశాలలో సిసి కెమెరాలు కూడా లేదన్నారు.