వరంగల్: కాశిబుగ్గ కాశీ విశ్వేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీకమాస ఉత్సవాలు
వరంగల్ జిల్లా కాశిబుగ్గ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు.