శ్రీశైలం: ఆత్మకూరు మండలంలో పల్లెపండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు మండలంలో పల్లెపండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. కరివేన గ్రామంలో రూ.62 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించతలపెట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అదేవిధంగా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో రూ.1 కోటి డీఎంఎఫ్ నిధులతో చేపట్టనున్న కొత్తసోముల చెరువు పునరుద్ధరణ పనులకు కూడా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణతో సాగునీటి వసతులు మెరుగుపడి, ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.