గజపతినగరం: గంట్యాడ బీసీ బాలుర వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గంట్యాడ బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఆర్వో ప్లాంట్ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని మరియు పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.