నంద్యాల అర్బన్: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి:NFIW
Nandyal Urban, Nandyal | Aug 22, 2026
మహిళల రక్షణ సాధికారతపై చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నంద్యాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపినట్లు NFIW నాయకురాలు రజిత తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహిళలు రక్షణకు అవసరమైన పటిష్టమైన చట్టాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా నియంత్రించాలన్నారు