హనుమకొండ: హన్మకొండ: వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి
హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో వీధి కుక్కలు గొర్రెలపై దాడి చేశాయి. ఈ ఘటనలో 12 గొర్రె పిల్లలు మృతి చెందాయి. సుమారు 60 వేల రూపాయల నష్టం జరిగిందని బాధితుడు గాదం రాజయ్య తెలిపారు. అధికారులు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.