పాయకరావుపేట: పాయకరావుపేటలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన గూడ్స్ వాహనం, డ్రైవర్ మృతి
పాయకరావుపేట జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడ్స్ వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సాంకేతిక లోపంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని, పరవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న గూడ్స్ లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ వినోద్ బాబు తెలిపారు.