రాయదుర్గం: కణేకల్లు లో బిజెపి నాయకులు, కార్యకర్తల సమావేశం
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో కణేకల్లు లో బిజెపి నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక వసుంధరా దేవి మాట్లాడుతూ బిజెపి చరిత్ర గురించి వివరించారు. ఒకప్పుడు కేవలం రెండు ఎంపి స్థానాలు ఉన్న బిజెపి నేడు కేంద్రంలో అధికారంలో ఉందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ గా అవతరించిందని తెలిపారు.