యాదగిరిగుట్ట: యాదాద్రిలో భూ దోపిడీపై లోకాయుక్తలో ఫిర్యాదు: అక్రమ వెంచర్లపై న్యాయ పోరాటం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తామని బుగ్గ శ్రీకాంత్ తెలిపారు. దీని కోసం ఆర్.టి.ఐ ద్వారా సాక్ష్యాల సేకరణ మొదలైంది.