భీమిలి: సింహాచలం అన్నప్రసాదానికి రూ. 1,00,016 విరాళం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్య అన్నప్రసాదానికి విశాఖపట్నం కూర్మన్నపాలెంకు చెందిన ఎల్. భాస్కరం గారు రూ. 1,00,016 విరాళంగా అందజేశారు. ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు గారు ఈ చెక్కును స్వీకరించి, దాతను సత్కరించారు.