శ్రీశైలం: దేవీ నవరాత్రుల సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ఘనంగా వసంతోత్సవం
దేవి నవరాత్రుల సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ఘనంగా వసంతోత్సవం నిర్వహించారు, ఆత్మకూరు పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి శాల వద్ద గత తొమ్మిది రోజులుగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనంతరం నిన్న బుధవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. నిమజ్జనం అయిన మరుసటి రోజు గురువారం రోజు వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఆర్యవైశ్య యువకులు ఆటోలో రంగులు రంగులు పెట్టుకొని ఒకరికొకరు రంగు నీళ్లు చల్లుకుంటూ సంతోషంగా వసంతోత్సవాన్ని నిర్వహించారు.