మహబూబ్ నగర్ అర్బన్: పట్టణంలో వెల్నెస్ సెంటర్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్
కృష్ణ
మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల వెల్నెస్ సెంటర్ మార్చారు . అక్కడ వసతులు సక్రమంగా లేవని పేషెంట్లకు సరైన వైద్యం అందించకపోవడంతో అక్కడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు జర్నలిస్టులకు మందులు సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కొందరు అంటున్నారు. బుధవారం వెల్నెస్ సెంటర్ ను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. అక్కడ మందులు సక్రమంగా లేవని విధులకు సక్రమంగా స్టాప్ రావడంలేదని వివరాలు సేకరించి విధులు సక్రమంగా నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వెల్నెస్ సెంటర్కు వచ్చే పేషంట్లకు సరి అయిన వైద్యం అందించి మందులను సరఫరా చేయాలని సూచించారు