మహబూబ్ నగర్ అర్బన్: జిల్లాలో ఉర్దూతో పాటు తెలుగు ఆప్షన్ ఇవ్వాలి: ఏఐఎస్ఎఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజు
స్థానిక ఏనుగొండ కేజీబీవీలో పాఠశాలలో ఉర్దూతో పాటు తెలుగు భాషను మొదటి లాంగ్వేజ్ చేర్చాలని మంగళవారం ఏఐఎస్ఎఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజు కోరారు. కేవలం ఉర్దూ భాష ఉండటంవల్ల తెలుగును ఎంచుకునే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారు. జిల్లా సెక్రటరీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించి ప్రత్యేక ఉపాధ్యాయులు నియమించాలని విద్యాశాఖ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందించారు.