వనపర్తి: వనపర్తిలో దళిత వ్యక్తికి అవమానం: నిందితులను అరెస్టు చేయాలని ధర్నా
వనపర్తి జిల్లా మంగంపల్లిలో దళితుడిని దుర్భాషలాడిన వారిని అరెస్టు చేయాలని ధర్మసమాజ్ పార్టీ ఆందోళన చేపట్టింది. నిందితులపై కేసులు నమోదు చేసినా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ వనపర్తి రాజీవ్ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులను అరెస్టు చేసి, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.