మార్కాపురం: జిల్లా కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అందజేసిన కలెక్టర్ విజయ సునీత
స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణలో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సిబ్బందిని ప్రోత్సహించేందుకు స్వచ్ఛ ఆంధ్ర–2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మార్కాపురం కంభం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పాల్గొని స్వచ్ఛత, పారిశుధ్య రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు.