పాయకరావుపేట: నక్కపల్లిలో కొనసాగుతున్న నామినేషన్ల జోరు: రెండో రోజు 65 నామినేషన్లు
నక్కపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ముగిసింది. గురువారం ఒక్కరోజే 65 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 90 నామినేషన్లు నమోదైనట్లు ఆర్వో వర్థన్ తెలిపారు. ఇందులో వైసీపీ, టీడీపీ, జనసేన మరియు ఇతరుల నామినేషన్లు ఉన్నాయి.