కాకినాడ సిటీ: కాకినాడలో పెరుగుతున్న బియ్యం ధరలు: అధికారులకు ఆర్ ఎస్ పి వినతి
బియ్యం ధరలను తగ్గించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ సివిల్ సప్లై అధికారులకు ఆర్ ఎస్ పి జిల్లా అధ్యక్షుడు రంబాల సతీష్ వినతి పత్రం ఇచ్చారు. దుకాణాల్లో ధరల బోర్డులు పెట్టడం లేదని, ధరల నియంత్రణకు పర్యవేక్షణ చేపట్టాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.