వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల-వరికుంటపాడు మార్గంమధ్యంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారు మండల పరిధిలోని కాంచెరువు ఎస్టీ కాలనీకి చెందిన రాపూర్ కళ్యాణ్, రాపూర్ మాలకొండయ్యగా గుర్తించారు. వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.