సూర్యాపేట: సూర్యాపేటలో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్: అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన
అక్టోబర్ నెల అంతా సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్గా సూర్యాపేటలో నిర్వహించనున్నారు. ఆన్లైన్ మోసాలు, అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.