భువనగిరి: త్రిశూల్ లాడ్జిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 17 మంది అరెస్ట్
భువనగిరి మండలం వడయిగూడెంలోని త్రిశూల్ లాడ్జిలో పేకాట ఆడుతున్న 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, వాహనాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.