పలమనేరు: ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. వ్యవసాయ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేస్తామని MLA అమర్నాథ్ రెడ్డి చెప్పారు. త్వరలో 33 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మార్కెట్ యార్డుకు చెందిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరో 3 రోజుల్లో పూర్తవుతుందన్నారు. దీంతో పలమనేరు నియోజకవర్గ రైతులే కాకుండా జిల్లా వ్యాప్తంగా మరియు ఆంధ్ర కర్ణాటక బార్డర్ కావడంతో ఆ ప్రాంత రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.