గన్నవరం: ఉంగుటూరులో వీఆర్ఏల వినూత్న నిరసన: 13వ రోజుకు చేరిన సమ్మె
ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల నిరసన 13వ రోజుకు చేరుకుంది. పే-స్కేల్, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాల డిమాండ్లతో వీఆర్ఏలు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. డిమాండ్లు తీరే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.