డోన్: బేతంచర్లలో వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించండి: బీఎండబ్ల్యూ సభ్యులు
Dhone, Nandyal | Aug 22, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బేతంచెర్ల ముస్లిం మైనారిటీ కమిటీ(BMW) సభ్యులు శనివారం నగర పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని పలు కాలనీలలో వీధి కుక్కల సంఖ్య మితిమీరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.