రాయదుర్గం: ఇసుక డంప్ ను? ఒక ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు తెలిపిన డి.హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి
డి హీరేహల్ మండలంలోని ఓబులాపురం గ్రామ శివారులో సిద్దాపురం గ్రామానికి చెందిన ఒక ఇసుక ట్రాక్టర్ ను, డి.హిరేహాల్ వద్ద ఇసుక డంప్ ను పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్ణాటక కు అక్రమంగా ఇసుక ను తరలిస్తుంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. గృహావసరాలకు తప్ప ఎవరైనా ఇసుక అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.