ఒంగోలు అర్బన్: మద్దిపాడు మండలం ఇనుములూరు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు, ప్రజా సమస్యలపై ఆరా
Ongole Urban, Prakasam | Oct 1, 2026
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఇనుములూరు గ్రామంలో గురువారం కలెక్టర్ రాజబాబు పర్యటించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎప్పుడైనా సరే ప్రజలు తమను సమస్యల పరిష్కారానికి కలవచ్చని రాజబాబు అన్నారు. పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు.