ధర్మపురి: ధర్మపురిలో ఎండిపోయిన 30 ఎకరాల పంటలు: మండిపడిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యతో 30 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. దీనిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.