కొత్తపేట: కొత్తపేటలో ఘనంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేటలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తడి-పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం వంటి అంశాలపై సూచనలు చేశారు.