కర్నూలు: నందవరంలో వినూత్న నామినేషన్.. బస్తాతో వచ్చిన ఎంపీటీసీ అభ్యర్థి!
కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులాదిన్నెలో ఎంపీటీసీ అభ్యర్థి మునాఫ్ వినూత్నంగా నామినేషన్ వేశారు. 1,500 రూపాయల ఫీజును మొత్తం పది రూపాయల నాణేల రూపంలో బస్తాలో తీసుకొచ్చి చెల్లించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఇలా చేసినట్లు ఆయన తెలిపారు.