పార్వతీపురం: కురుపాం: భలుకోట పాఠశాల, అంగన్వాడీల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కురుపాం మండలం భలుకోటలో పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎంపీపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో బోధనా ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, పోషకాహారం మరియు రికార్డులను పరిశీలించి, నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.