తుని: తుని కళాశాల భోజనంలో బల్లి: అస్వస్థతకు గురైన 19 మంది విద్యార్థినులు
Tuni, Kakinada | Sep 27, 2026 తుని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహంలో భోజనం తిన్న 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సాంబారులో బల్లి ఉండటాన్ని గమనించిన విద్యార్థినులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం బాధితులందరికీ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.