రాజమండ్రి సిటీ: కేసుల పరిష్కారానికి రాజీమార్గమే రాజమార్గం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
తూర్పుగోదావరి జిల్లాలో కేసుల పరిష్కారానికి రాజీమార్గమే రాజమార్గంగా గుర్తించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో జిల్లాకు సంబంధించి 85 వేలు పైగా కేసులు పెండింగ్‌లో గుర్తించినవి 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2136 ప్రీ లిటిగేషన్ కేసులు మొత్తం కలిపి 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేసినట్టు తెలిపారు