ప్రత్తిపాడు: కాకినాడ: కత్తిపూడి వద్ద ఘోర ప్రమాదం, నలుగురు భవానీ భక్తుల మృతి
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందారు. డెంకాడ నుంచి విజయవాడ వెళ్తుండగా బస్సు మరమ్మతుల కోసం ఆపిన సమయంలో, రోడ్డు దాటుతున్న భక్తులను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ప్రాణాలు కోల్పోయారు.