ఒంగోలు అర్బన్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మాబు డిమాండ్
Ongole Urban, Prakasam | Oct 2, 2026
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని CPM జిల్లా కార్యదర్శి ఎస్.కె.మాబు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా తొలగించిన వారందరి ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు. ఈ డిమాండ్లతో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.