శ్రీకాకుళం: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ శ్రేణులకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు
శ్రీకాకుళంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.